- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Exploitation: కాసులిస్తే సరి కనువిందే..! ఇన్‌స్టాలో నటీమణులు, ఇన్‌ఫ్లుయెన్సర్ల బరితెగింపు
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సబ్‌స్క్రైబర్స్’ ఫీచర్‌ను అడ్డుపెట్టుకుని కొందరు నటీమణులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు 'స్కిన్ షో' చేస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: 90వ దశకంలో సినిమాల్లో నటించాలనేది కోట్లాది మంది కల. ఆ కల నిజం చేసుకోవడానికి నటనను, కష్టాన్ని నమ్ముకునే వారు ఆర్టిస్టులు. కానీ, సోషల్ మీడియా యుగంలో ‘షార్ట్ కట్’ సక్సెస్ కోసం కొందరు ఎంచుకుంటున్న దారులు ఇప్పుడు సభ్యసమాజాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. హీరోయిన్లుగా ఎదగాల్సిన వారు, ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మారి.. చివరకు ‘సబ్‌స్క్రిప్షన్’ పేరుతో చేస్తున్న గ్లామర్ షో ఇప్పుడు ఒక వికృత ట్రెండ్‌గా మారింది.
ఏమిటీ ‘సబ్‌స్క్రిప్షన్’ ఉచ్చు?
ఇన్‌స్టాగ్రామ్ తన క్రియేటర్ల కోసం ‘సబ్‌స్క్రైబర్స్’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. అంటే, కొంత ఫీజు చెల్లించిన వారికే ప్రత్యేకమైన (Exclusive) కంటెంట్ కనిపిస్తుంది. దీన్ని కొందరు నటీమణులు తమ ‘స్కిన్ షో’కి వేదికగా మార్చుకున్నారు. బయటి ప్రపంచానికి పద్ధతిగా కనిపిస్తూనే.. నెలకు రూ.300 నుంచి రూ.400 చెల్లించిన ‘పెయిడ్ బ్యాచ్’ కోసం మాత్రం హద్దులు దాటుతున్నారు. బోల్డ్ ఫోటోలు, అశ్లీలతకు దగ్గరగా ఉండే రీల్స్‌ను కేవలం ఆ సబ్‌స్క్రైబర్ల కోసమే వదులుతున్నారు. అయితే, తాము డబ్బు తీసుకుని కేవలం కొందరికే చూపిస్తున్నాం కాబట్టి సేఫ్ అనుకోవడం వారి భ్రమే అవుతోంది. సబ్‌స్క్రైబర్లలో ఎవరో ఒకరు ఆ కంటెంట్‌ను స్క్రీన్ రికార్డింగ్, స్క్రీన్ షాట్ల ద్వారా బయటకు వదులుతున్నారు. దీంతో అంతా గుట్టగా సాగుతుందని అనుకున్న బోల్డ్ కంటెంట్ కాస్తా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ట్విట్టర్, టెలిగ్రామ్ లాంటి వాటిల్లో వైరల్ అవుతోంది. దీంతో పైరసీ పుణ్యమా అని సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్ల పరువు కాస్త బజారున పడటమే కాకుండా కెరీర్ పరంగా నాశనం అవుతోంది.
యువత జేబులకు చిల్లు.. ఇన్‌ఫ్లూయెన్సర్ల లక్షలు
‘సబ్‌స్క్రైబర్స్’ ఆప్షన్‌తో అడల్డ్ కంటెంట్ మత్తులో పడి యువత తమ కష్టార్జితాన్ని వాటి కోసం ఖర్చు చేస్తున్నారు. ఇలా ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్లు నెలకు ఎంత లేదన్నా.. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రెండు చేతులా సంపాదిస్తున్నారు. టాలెంట్‌తో సంబంధం లేకుండా కేవలం గ్లామర్‌తో ఇంతటి ఆదాయం వస్తుండటంతో, మరికొందరు కూడా ఇదే దారిలో నడవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా యువతను దృష్టి పెట్టుకుని.. ఇన్‌స్టాలో చేస్తున్న ‘సబ్‌స్క్రైబర్స్’ దందాపై పోలీసులు ఫోకస్ పెట్టాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.






