- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ మే 30న బిగ్ స్క్రీన్‌పై మళ్లీ మాజికల్ కల్ట్ క్లాసిక్ ఖలేజాను అనుభవించండి.. నిర్మాత ఇంట్రెస్టింగ్ ట్వీట్
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వచ్చి కమర్షియల్‌గా విజయం సాధించకున్నా కల్ట్ క్లాసిక్‌గా పేరు దక్కించుకున్న చిత్రం ఖలేజా (Khaleja).

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వచ్చి కమర్షియల్‌గా విజయం సాధించకున్నా కల్ట్ క్లాసిక్‌గా పేరు దక్కించుకున్న చిత్రం ఖలేజా (Khaleja). పదిహేనేండ్ల తర్వాత తిరిగి ఈ మూవీని మేకర్స్ థియేటర్లలోకి తీసుకు వస్తున్నారు. ఈ నేథ్యంలో తాజాగా శుక్రవారం ఈ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. మే30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా నిర్మాత నాగ వంశీ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు.
‘త్రివిక్రమ్ గారు అత్యంత చురుకైన రచన x సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అద్భుతమైన కామిక్ టైమింగ్ స్వచ్ఛమైన బంగారు చిత్రాలను అందించిన కాంబో..కాలానికి ఎంతో ముందున్న సినిమా, ఈ మే 30న బిగ్ స్క్రీన్‌పై మళ్ళీ మాజికల్ కల్ట్ క్లాసిక్ ఖలేజాను అనుభవించండి’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. మరి థియేటర్లలో రీరిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తోందో చూడాల్సి ఉంది.






