ధనుష్ 'D57'కి ఆ ఒక్కటి తప్ప... అంతా సెట్

by Pulgam srinivas |

అధికారిక ప్రకటన వెలువడితే ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీలో క్రేజీ మూవీలలో 'D57' ఒకటిగా నిలిచే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

ధనుష్ D57కి ఆ ఒక్కటి తప్ప... అంతా సెట్
X

దిశ, వెబ్‌ డెస్క్: కోలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్రాజెక్టుల్లో ధనుష్ 'D57' ఒకటి. గత కొంతకాలంగా ఈ సినిమాపై భారీగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ధనుష్ హీరోగా నటించనుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ధనుష్, జాన్వీ కపూర్, వెంకట్ ప్రభు మధ్య చర్చలు పూర్తయ్యాయని, ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే అన్ని అంశాలు దాదాపు సెట్ అయినప్పటికీ, ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోవడం మాత్రమే చిన్న సస్పెన్స్‌గా మారింది.

అధికారిక ప్రకటన వెలువడితే ఈ ఏడాది తమిళ సినీ పరిశ్రమలోనే అత్యంత క్రేజీ మూవీ అనౌన్స్‌మెంట్‌లలో ఇది ఒకటిగా నిలిచే అవకాశముందని కోలీవుడ్ మీడియా అభిప్రాయపడుతోంది. హిందీ చిత్రాల ద్వారా కెరీర్‌ను ప్రారంభించి మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ ఇప్పటికే తెలుగులో పలు సినిమాల్లో నటించింది. ఇప్పుడు ధనుష్ 'D57' ద్వారా తమిళ సినీ పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానూ ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story