- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ratsasan : భయంకరమైన మర్డర్ అండ్ థ్రిల్లర్ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది.. మరోసారి వణకడానికి సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్
విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటించిన మర్డర్ అండ్ థ్రిల్లర్ మూవీ ‘రాట్సాసన్’.

దిశ, సినిమా: విష్ణు విశాల్ (Vishnu Vishal) ప్రధాన పాత్రలో నటించిన మర్డర్ అండ్ థ్రిల్లర్ మూవీ ‘రాట్సాసన్’ (Ratsasan). రామ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ తమిళ మూవీలో అమలా పాల్, శరవణన్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రలో నటించారు. 2018 అక్టోబర్‌లో రిలీజైనా ఈ చిత్రం మంచి సక్సెస్‌ను అందుకుంది. దీంతో ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ కూడా చేశారు. ఇక ఇదే మూవీ తెలుగులో ‘రాక్షసుడు’ అనే పేరుతో రిలీజైంది. తెలుగు వెర్షన్‌లో ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించగా.. రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు. తెలుగులో 2019లో రిలీజై సస్పెన్సింగ్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది. అలాంటి ఈ మూవీ ఇప్పుడు సీక్వెల్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ‘రాట్సాసన్’ సీక్వెల్‌కు సర్వం సిద్ధం.. 2026లో భారతదేశపు అత్యంత భయానక థ్రిల్లర్ తిరిగి వస్తుంది.. మరోసారి వణకడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ ప్రస్తుతం ఓ పోస్ట్ నెట్టింట దర్శనమివ్వగా.. క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లింక్






