- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతీ ఇండస్ట్రీలో ప్లస్సులు, మైనస్సులు ఉంటాయి.. బాలీవుడ్‌పై జ్యోతిక షాకింగ్ కామెంట్స్
సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జ్యోతికకు ప్రస్తుతం హిందీలో వరుస ఆఫర్లు రావడంపై స్పందించారు.

దిశ, సినిమా: ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సీనియర్ నటి జ్యోతిక ఒకరు. కెరీర్‌లో పీక్స్‌లో ఉన్న టైమ్‌లో తమిళ స్టార్ సూర్యతో ప్రేమ, పెళ్లి, పిల్లలు అనంతరం.. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకున్న ఈమె తాజా ఇంటర్వ్యూలో బాలీవుడ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
అయితే.. ఈ అమ్మడు సౌత్‌లో స్టార్ హీరోయిన్ అవడానికి ముందే బాలీవుడ్‌లో ట్రై చేసిందట. అక్కడ ‘డోలి సజాకే రఖ్నా’ అనే చిత్రంతో 1998లో హిందీలోకి అడుగు పెట్టిందట ఈ అమ్మడు. అక్షయ్ ఖన్నా హీరోగా నటించిన ఈ చిత్రం అనుకున్నస్థాయిలో ఆకట్టుకోలేక డిజాస్టర్ కావడంతో జ్యోతికకు బాలీవుడ్ మరో అవకాశం ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తమిళంలో ట్రై చెయ్యగా.. అక్కడ కూడా ఫస్ట్ సినిమా ప్లాప్ అయ్యిందట. కానీ తర్వాత అక్కడ వరుస ఆఫర్లు రావడంతో.. తక్కువ కాలంలోనే తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జ్యోతికకు ప్రస్తుతం హిందీలో వరుస ఆఫర్లు రావడంపై స్పందిస్తూ.. ‘నేను బాలీవుడ్ చిత్రంతోనే నా సినీ కెరీర్‌ను స్టార్ట్ చేశాను. కానీ అక్కడ నా ఫస్ట్ సినిమా ఆడకపోవడంతో బాలీవుడ్ నాకు మరో అవకాశం ఇవ్వలేదు. అలాగే తమిళంలో కూడా నా ఫస్ట్ సినిమా ఆడలేదు. కానీ అక్కడ నాకు ఆఫర్లు వచ్చాయి. అదే బాలీవుడ్‌కు, తమిళంకు ఉన్నా తేడా. అయితే.. అప్పటికీ ఇప్పటికీ బాలీవుడ్‌లో చాలా మార్పులు వచ్చాయి. మహిళల కోసం ప్రత్యేకంగా కథలు రాస్తున్నారు. దక్షిణాదిలో ఇంకా ఆ దిశగా పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదు. ఈ లెక్కన ప్రతి ఇండస్ట్రీలో ప్లస్సులు, మైనస్సులు ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. జ్యోతిక ప్రస్తుతం ‘సిస్టమ్’ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.






