- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యుఫోరియా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచే ప్రసారం
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'యూఫోరియా' చిత్రాన్ని ఏప్రిల్ 2వ తేదీ నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: చాలా కాలం గ్యాప్ తర్వాత దర్శకుడు గుణశేఖర్ ‘యూఫోరియా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన థియేటర్లలో విడుదలైంది. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ భారీ స్థాయి వసూళ్లను రాబట్టడంలో విఫలమైంది. ఇక ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని తమ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ సంస్థ ప్రకటించింది. మరి ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ చిత్రంలో భూమిక చావ్లా, సారా అర్జున్ ప్రధాన పాత్రలు పోషించగా, విఘ్నేష్ గవిరెడ్డి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నాజర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించిన ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించారు.






