- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తరుణ్ భాస్కర్ సినిమాపై అలా స్పందించిన ఈషా రెబ్బ
ఈషా రెబ్బ గాయపడ్డ సింహం చిత్రంలో హీరోగా నటించిన తరుణ్ భాస్కర్‌ను ఉద్దేశిస్తూ, "ఈ సినిమాలో మీరు చాలా బాగా నచ్చారు (Loved you in this)" అని ప్రశంసించింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటుడు, దర్శకుడు అయిన తరుణ్ భాస్కర్ తాజాగా గాయపడ్డ సింహం చిత్రంలో హీరోగా నటించాడు. ఈ మూవీని మే 1వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఈ మూవీ బృందం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇది ఆధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే పెరిగాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌పై యువ నటి ఈషా రెబ్బ స్పందించింది. ఈ సినిమా ట్రైలర్ బాగుందని, ఇందులో నటించిన నటీనటులు అందరూ తమ అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారని పేర్కొంది.
ముఖ్యంగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన తరుణ్ భాస్కర్‌ను ఉద్దేశిస్తూ, "ఈ సినిమాలో మీరు చాలా బాగా నచ్చారు (Loved you in this)" అని ప్రశంసించింది. కొంతకాలం క్రితం వీరిద్దరూ కలిసి ఓం శాంతి శాంతి శాంతిః అనే చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి విజయ్ దేవరకొండ పెళ్లికి కూడా హాజరయ్యారు. ఇక తాజాగా ఆయన సినిమాపై ఈ బ్యూటీ ప్రత్యేకంగా స్పందించడంతో ఈ ముద్దుగుమ్మ చేసిన ఈ పోస్ట్ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించగా, జేడీ చక్రవర్తి, శ్రీ విష్ణు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.






