- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈషా నుంచి ‘ఆ నింగిలోని చందమామ’ సాంగ్ రిలీజ్.. మనసులను కట్టిపడేస్తున్న లిరిక్స్
ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’(Raju Weds Ramabai) మూవీతో సూపర్ హిట్ కొట్టిన అఖిల్ రాజ్(Akhil Raj)తో పాటు త్రిగుణ్(Trigun) హీరోలుగా నటిస్తున్న సినిమా ‘ఈషా’(eesha).

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’(Raju Weds Ramabai) మూవీతో సూపర్ హిట్ కొట్టిన అఖిల్ రాజ్(Akhil Raj)తో పాటు త్రిగుణ్(Trigun) హీరోలుగా నటిస్తున్న సినిమా ‘ఈషా’(eesha). శ్రీనివాస్ మన్నె(Srinivas Manne) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హెబ్బా పటేల్(Hebah Patel) హీరోయిన్‌గా నటిస్తోంది.అలాగే ఇందులో సిరి హనుమంత్. పృథ్వీ రాజ్ వంటి తదితరులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్ టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టైటిల్స్ అనౌన్స్‌మెంట్, గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టాయి. అయితే డిసెంబర్ 25న విడుదల కానున్నది. ఇక వీడియో కంటెంట్ తోనే ఇంత భయపెడుతున్న ‘ఈషా’.. వెండితెరపై ఇంకెలా ఉంటుందోనని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఆ నింగిలోని చందమామ’(ఫ్రెండ్షిప్ సాంగ్) పాట రిలీజ్ అయింది.
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగాఓ పోస్ట్ షేర్ చేస్తూ.. ‘అన్నింటికంటే ప్రత్యేకమైన బంధం - స్నేహం శ్రేయ ఘోషాల్(Shreya Ghoshal) గాత్రాలతో నిజంగా మాయాజాలంగా మారింది.. ఈషా నుండి #AaNingiloniChandamama లిరికల్ వీడియో ఇప్పుడే విడుదలైంది’ అని రాసుకొస్తూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పాటలోని లిరిక్స్ యువత మనసులను కట్టిపడేస్తుంది.






