- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘాటి సినిమాకు షాక్ ఇచ్చిన ఈగల్ టీమ్.. ఆ సీన్లు తొలగించాలని హెచ్చరికలు
రేపు విడుదల కానున్న ఘాటి చిత్ర యూనిట్‌కు పలు సన్నివేశాలు తొలగించాలని ఈగల్ టీమ్ హెచ్చరికలు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఘాటీ సినిమా (GHAATI movie) రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రేపు ఈ సినిమా విడుదలకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తుండగా.. తెలంగాణ ఈగల్ టీమ్ (Eagle Team) చిత్ర యూనిట్ కు ఊహించని షాక్ ఇచ్చింది. ఘాటి సినిమాలోని అనేక సన్నివేశాలపై ఈగల్ టీమ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా గంజాయి వాడకం (Cannabis use)పై అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉండటంతో వాటిని తొలగించాలని ఈగల్ టీమ్ తెలిపింది. గంజాయి వాడకం పై ఉన్న సన్నివేశాలను తొలగించకపోతే.. NDPS యాక్ట్ ప్రకారం తాము చర్యలు తీసుకుంటామని చిత్ర బృందానికి ఈగల్ టీమ్ (Eagle Team) హెచ్చరికలు జారీ చేసింది. మరీ ఈగల్ టీమ్ హెచ్చరికలపై ఘాటీ సినిమా యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.






