- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీజ దమ్ముకు దువ్వాడ వార్నింగ్.. పబ్లిసిటి కోసమే అంటూ ఫైర్
నా పేరు గురించి బయటకు వెళ్లి ఒక్కసారి అడుగు... నీకే అందరూ చెప్తారు అంటూ రెచ్చిపోయింది.

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ సీజన్ 9 చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది ఎలిమినేట్ కాగా, మరికొంతమంది వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా దమ్ము శ్రీజ తో పాటు భరణి బిగ్ బాస్ లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ ఇద్దరిలో ఒకరు మాత్రమే హౌస్ లో ఉంటారు. మరొకరు ఎలిమినేట్ కావాల్సిందే. ఇది ఇలా ఉండగా, దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి పాపులారిటీ దక్కించుకుంటున్నారు. అయితే ఆమె బిగ్ బాస్ లోకి వచ్చిన వెంటనే దమ్ము శ్రీజతో గొడవ పెట్టుకున్న సంగతి తెలిసిందే. నువ్వు ఎవరో నాకు తెలియదు అంటూ మాధురి పరువు తీశారు దమ్ము శ్రీజ. అయితే దానికి మాధురి కూడా కౌంటర్ ఇచ్చారు.
నా పేరు గురించి బయటకు వెళ్లి ఒక్కసారి అడుగు... నీకే అందరూ చెప్తారు అంటూ రెచ్చిపోయింది. అయితే ఈ వివాదం పై తాజాగా దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. దమ్ము శ్రీజ అనే అమ్మాయి అనుకుంటా.... ఆమెను మాధురి ఎలిమినేట్ చేయలేదని వెల్లడించారు. బిగ్ బాస్ లో ఉన్న మిగిలిన ప్లేయర్లందరూ కలిసి హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారని గుర్తు చేశారు. మాధురి ఎవరో తెలియదు అని చెప్పినందుకు ఆమెను బయటకు పంపించలేదని క్లారిటీ ఇచ్చారు. అలాంటి చిన్నపిల్లలను మాధురి అస్సలు పట్టించుకోదని వివరించారు. శ్రీజ ఎవరో నాకు తెలుసు.. ఆమెది వైజాగ్, ఇంటి నెంబర్ కూడా చెబుతా అంటూ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలియని వాళ్ల గురించి మనం తెలుసుకునేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది.. ఆ పద్ధతి ప్రకారం మాధురి దగ్గర శ్రీజ వ్యవహరించి ఉంటే బాగుండేదని వార్నింగ్ ఇచ్చాడు దువ్వాడ శ్రీనివాస్. మాధురి నువ్వు ఎవరు ? అని అడిగితేనే వైరల్ అవుతారని భావించి శ్రీజ అలా వ్యవహరించిందని కౌంటర్ ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్. వాస్తవానికి మాధురికి బిగ్ బాస్ అంటే అస్సలు నచ్చదు.. కానీ వాళ్ల నుంచి ఒత్తిడి రావడంతో వెళ్లిందని తెలిపారు దువ్వాడ శ్రీనివాస్.






