- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Duvvada Srinivas: బిగ్ బాస్ విన్నర్ మాధురే...పక్కా రాసిపెట్టుకోండి !
దివ్వెల మాధురి కచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా మారుతుందని దువ్వాడ శ్రీనివాస్ సంచలన ప్రకటన చేశారు. ఇందులో ఏమాత్రం

దిశ, వెబ్ డెస్క్ : దివ్వెల మాధురి కచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా మారుతుందని దువ్వాడ శ్రీనివాస్ సంచలన ప్రకటన చేశారు. ఇందులో ఏమాత్రం డౌట్ లేదన్నారు. మాధురి ముందు మిగతా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ జూజుబీ అంటూ వ్యాఖ్యానించారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లోకి దివ్వెల మాధురి ఇటీవల కాలంలోనే ఎంట్రీ ఇచ్చారు. వైల్డ్ కార్డు ద్వారా ఆమె హౌజ్ లోపలికి వెళ్లారు.
ఇక మొన్నటి వరకు బిగ్ బాస్ సీజన్ 9ను పట్టించుకోని జనాలు, దివ్వెల మాధురి రాగానే ఈ సీజన్ తెగ చూస్తున్నారట. తండ్రి వయసులో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ తో దివ్వెల మాధురి కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ జంట బాగా పాపులర్ అయింది. అలాంటప్పుడు బిగ్ బాస్ లోకి దివ్వెల మాధురి వస్తే జనాలు చూడక ఉంటారా? కచ్చితంగా ఎగబడి చూస్తారు.
అయితే దివ్వెల మాధురి బిగ్ బాస్ లోకి వెళ్లడంపై దువ్వాడ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన మాధురి కచ్చితంగా ఇందులో విజేతగా మారుతుందని ఆయన వెల్లడించారు. ఇక బిగ్ బాస్ గెలిస్తే వచ్చిన ప్రైజ్ మనీని వికలాంగులు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. ఆ డబ్బులో ఒక్క రూపాయి కూడా మేము వాడుకోబోమని తెలిపారు.






