- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘డ్రాగన్’లో టోవినో థామస్‌కు అనుకున్న పాత్ర ఏంటో తెలుసా.. సూపర్ ఛాన్స్ మిస్ అయ్యాడే
డ్రాగన్ చిత్రంలో సిద్ధాంత్ గుప్తా పోషించిన పాత్ర కోసం మొదట టోవినో థామస్‌ను మేకర్స్ అనుకున్నారని, కానీ ఆయన ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ‘డ్రాగన్’ మూవీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. నాలుగు నిమిషాలకు పైగా నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వీడియోకు భారీ స్పందన లభిస్తోంది. ఈ గ్లింప్స్‌లో ‘డ్రాగన్’ వరల్డ్‌ను పరిచయం చేస్తూ సినిమా ఎలాంటి కథా నేపథ్యంతో సాగబోతోందనే అంశాన్ని ప్రేక్షకులకు చూపించారు. అలాగే సినిమాలో కనిపించబోయే పలువురు విలన్స్‌కు సంబంధించిన ఇంట్రో షాట్స్‌ను కూడా మేకర్స్ హైలైట్ చేశారు. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం మలయాళ స్టార్ నటుడు టోవినో థామస్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఆయన ఆ పాత్రను తిరస్కరించినట్లు కూడా ప్రచారం జరిగింది. దీంతో టోవినో థామస్‌కు అసలు ఏ పాత్రను అనుకున్నారు అనే అంశంపై తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నటుడు సిద్ధాంత్ గుప్తా ఈ చిత్రంలో ‘బోబీ సర్కార్’ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ పాత్ర కోసం టోవినో థామస్‌ను మేకర్స్ అనుకున్నారని, కానీ ఆయన ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు సమాచారం. ఇక సినిమాలో ఏటీసీ (ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ)కు వజీర్‌గా, అలాగే ఎన్టీఆర్ పాత్రకు సోదరుడిగా ఈ క్యారెక్టర్ ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.






