డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయిన 'దో దీవానే సెహర్ మేన్'.. ఓటీటీ డేట్ ఖరారు

by Pulgam srinivas |

'దో దీవానే సెహర్ మేన్' ఏప్రిల్ 17వ తేదీ నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయిన దో దీవానే సెహర్ మేన్.. ఓటీటీ డేట్ ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్: సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దో దీవానే సెహర్ మేన్’. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై హిందీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఏప్రిల్ 17వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని తమ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన ఈ సినిమా, ఓటీటీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. రవి ఉద్యవార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్, రాంకార్ప్ మీడియా బ్యానర్లపై సంజయ్ లీలా భన్సాలీ, ప్రేరణ సింగ్, ఉమేష్ కుమార్ బన్సాల్, భరత్ కుమార్ రంగా కలిసి నిర్మించారు.

Next Story