- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
“DJ టిల్లు” నటుడి ఇంట తీవ్ర విషాదం
ప్రముఖ నటుడు మురళీధర్ గౌడ్ భార్య శశికళ కాసేపటి క్రితమే మృతి చెందారు.

dj tillu actor Muralidhar Goud's wife Sasikala passes away
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులను కోల్పోయిన టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు మురళీధర్ గౌడ్ భార్య శశికళ కాసేపటి క్రితమే మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో శశికళ బాధపడుతున్నారు. ఇందులో భాగంగానే ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కానీ ఆమె పరిస్థితి తాజాగా విషమించిన నేపథ్యంలో చికిత్స పొందుతూనే మరణించారు. దీంతో డీజే టిల్లు ( DJ Tillu) నటుడు మురళీధర్ గౌడ్ ( Actor Muralidhar Goud ) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసిన మురళీధర్ గౌడ్, ఇప్పటికే రిటైర్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత నటనపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే చాలా సినిమాలలో ట్రై చేసి.. చివరికి నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే రంగస్థలం, డీజే టిల్లు, బలగం, టిల్లు స్క్వేర్, మ్యాడ్, మేం ఫేమస్ లాంటి ఎన్నో సినిమాల్లో మురళీధర్ గౌడ్ సందడి చేశారు. ముఖ్యంగా తెలంగాణ యాస, భాష మాట్లాడడంలో మురళీధర్ గౌడ్ దిట్ట. అందుకే ఆయన నటన అంటే ఇప్పటి జనరేషన్ బాగా ఇష్టపడుతుంది. దానికి తగ్గట్టుగానే పెద్ద పెద్ద సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటున్నారు నటుడు మురళీధర్ గౌడ్. కాగా మురళీధర్ గౌడ్ భార్య శశికళ మృతి చెందిన నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.






