ఎన్ని రకాలుగా ప్రయత్నించిన ఆ హీరో నాకు పడట్లేదు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

by Sujitha Rachapalli |

బ్యూటిపుల్ దిశా పటానీ ప్రస్తుతం పంజాబీ సింగర్ తల్విందర్ సింగ్ సిద్ధుతో రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అయితే గతంలో ఎక్స్‌ బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ గురించి ఈ భామ మాట్లాడిన మాటలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు జనాలు.

ఎన్ని రకాలుగా ప్రయత్నించిన ఆ హీరో నాకు పడట్లేదు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా : బ్యూటిపుల్ దిశా పటానీ ప్రస్తుతం పంజాబీ సింగర్ తల్విందర్ సింగ్ సిద్ధుతో రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అయితే గతంలో ఎక్స్‌ బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ గురించి ఈ భామ మాట్లాడిన మాటలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు జనాలు. ‘టైగర్ ష్రాఫ్ నన్ను చాలా ఇంటర్వ్యూల్లో జస్ట్ ఫ్రెండ్‌గా మాత్రమే చెప్పుకొచ్చాడు. కానీ నేను దీనికంటే ఎక్కువ కోరుకుంటున్నా. అతన్ని ఇంప్రెస్ చేసేందుకు జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నా. ఓ సినిమాలో ఫైర్ రింగ్ నుంచి ఫ్లిప్ వంటి స్టంట్స్ చేశా. కానీ తను ఇంకా ఫ్రెండ్ మోడ్‌లోనే ఉన్నాడు. ఇంకా నన్ను అంగీకరించడం లేదు’ అని దిశ చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై స్పందిస్తున్న ఆమె అభిమానులు తనను పట్టించుకోని వ్యక్తిని వదిలేయడమే మంచి నిర్ణయమని.. తల్విందర్‌తో పెళ్లి చేసుకోమని సూచిస్తున్నారు.

Next Story