- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Disha Patani: ఎన్నో ఆశలతో ముంబై వచ్చా.. చేతిలో పెట్టినట్టే పెట్టి లాక్కున్నారు.. పాన్ ఇండియా హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని (Disha Patani).

దిశ, సినిమా: ‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని (Disha Patani). ఈ సినిమా ఊహించిన రేంజ్‌లో హిట్ కాకపోవడంతో బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. స్కిన్ షోతో మంచి మార్కులే సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరోయిన్.. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసి ఆకట్టుకుంది. ఇక గతేడాది వచ్చిన ‘కల్కి’ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు మరోసారి ప్రభాస్‌తో జత కట్టేందుకు సిద్ధం అయింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ (Spirit) చిత్రంలో దిశా పటానీ హీరోయిన్‌గా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న విషయాలు చెప్పుకొచ్చింది.
‘హీరోయిన్ అవ్వాలని ఎన్నో ఆశలతో ముంబైకి వచ్చాను. నేను ట్రైన్ ఎక్కిన సమయంలో నా చేతిలో కేవలం రూ. 500 మాత్రమే ఉన్నాయి. చాలా ఆడిషన్స్‌కు వెళ్లేదాన్ని.. ఎక్కువగా టీవీ యాడ్స్ కోసం ట్రై చేసేదాన్ని. ఈ క్రమంలోనే ఓ సినిమా ఆఫర్ వచ్చింది. నా మొదటి చిత్రానికి సంతకం కూడా చేశాను. అయితే.. ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందే నన్ను తీసేసి.. నా స్థానంలో మరొకరిని తీసుకున్నారు. ఆ టైమ్‌లో చేతిలో పెట్టినట్టే పెట్టి లాక్కున్నట్లు అయింది. అయితే.. ఆ విషయంలో నేను అంతగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే రిజెక్షన్సే మలన్ని మరింత బలంగా చేస్తాయని నేను చాలా నమ్ముతాను’ అని తెలిపింది.






