ఆ సింగర్‌తో దిశా పటానీ డేటింగ్? ఇదిగో ఫోటోలు

by velandi.Saikiran |

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దిశా పటాని, ప్రముఖ పంజాబీ సింగర్ తల్విందర్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆ సింగర్‌తో దిశా పటానీ డేటింగ్? ఇదిగో ఫోటోలు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: బాలీవుడ్ అందాల తార దిశా పటాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందానికి అందం, బోలెడు అవకాశాలతో ఇండస్ట్రీని దున్నేస్తోంది దిశా పటాని. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులో కూడా ఆమె సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఎప్పటికప్పుడు తన అంద చందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ, యూత్ గుండెల్లో గున‌పం దింపేస్తోంది. అయితే అలాంటి బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. ఆమె ప్రియుడుతో దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చినట్లు చెబుతున్నారు.

సింగర్ తో దిశా పటాని డేటింగ్ ?

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దిశా పటాని, ప్రముఖ పంజాబీ సింగర్ తల్విందర్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా చికాగోలో ఓ స్పెషల్ ఈవెంట్ జరిగింది. ఇందులో సింగర్ తల్విందర్ సింగ్ ప్రదర్శన కూడా చేశారు. అయితే ఈవెంట్ అనంతరం దిశా పటాని చేయి పట్టుకొని, బయటకు వచ్చాడు తల్విందర్. అనంతరం ఒకే కారులో ఈ జంట వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో పంజాబీ సింగర్ తల్విందర్ తో దిశా పటాని డేటింగ్ లో ఉన్నట్లు నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Next Story