GOD OF WAR : ఒక్క సినిమా కోసం ఇద్దరు స్టార్ హీరోల పోటీ??

by Sujitha Rachapalli |

సోషల్ మీడియాలో ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీపై స్టార్స్ వార్ జరుగుతోంది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రాబోతున్న సినిమాలో హీరో ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. జనవరిలో అనౌన్స్‌మెంట్ జరగబోతుండగా.. నిర్మాతలు ఏ స్టార్ హీరోను ఎంచుకోబోతున్నారనేది పెద్ద చర్చకు దారితీసింది. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీలో మురగన్‌గా యంగ్

GOD OF WAR : ఒక్క సినిమా కోసం ఇద్దరు స్టార్ హీరోల పోటీ??
X

దిశ, సినిమా : సోషల్ మీడియాలో ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీపై స్టార్స్ వార్ జరుగుతోంది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రాబోతున్న సినిమాలో హీరో ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. జనవరిలో అనౌన్స్‌మెంట్ జరగబోతుండగా.. నిర్మాతలు ఏ స్టార్ హీరోను ఎంచుకోబోతున్నారనేది పెద్ద చర్చకు దారితీసింది. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీలో మురగన్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేదా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది కాస్త ఫ్యాన్ వార్‌కు దారి తీసింది. త్రివిక్రమ్ ఈ సినిమా తీస్తే తారక్‌తోనే చేయాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తుంటే.. వెయ్యి కోట్ల రికవరీ కేవలం బన్నీతోనే సాధ్యమని ఆయన ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి హీరో ఎవరనేది మరో నెల రోజుల్లో తెలిసిపోయే చాన్స్ ఉండగా.. ఒకవేళ హీరోను ప్రకటించాక కూడా ఇదే యుద్ధం జరుగుతుందేమోనని అంటున్నారు విశ్లేషకులు.

Next Story