- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
National Film Awards: నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ విషయంలో డిజప్పాయింట్మెంట్.. కళ్లు మూసుకున్నారా అంటూ నెటిజన్లు కామెంట్స్
2023 సంవత్సరానికి 71వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: 2023 సంవత్సరానికి 71వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని భాషల నుంచి చిత్రాలను ఎంపిక చేసి.. మొత్తం 15 విభాగాల్లో అవార్డులు ప్రకటించింది. అయితే.. ఈ అవార్డుల ఎంపికపై ప్రస్తుతం నెట్టింట ట్రోల్స్ ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ది బెస్ట్ మూవీ, ది బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వీళ్లకే వస్తాయి అని నమ్మిన వారికి రాకపోవడంతో మూవీ లవర్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. అందులో మళయాళ చిత్రం ‘ఆడు జీవితం’ (గోట్ లైఫ్) ఒకటి. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహించాడు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీలో అమలాపాల్ హీరోయిన్‌గా నటించింది.
ఇందులోని పృథ్వీరాజ్ లైఫ్ టైం పెర్ఫామెన్స్‌కు విమర్శకుల ప్రశంసలు అందాయి. అలాంటి ఈ చిత్రానికి ఉత్తమ అవార్డు రాకవడం అందరికి షాకిచ్చింది. దీంతో ‘జాతీయ అవార్డులు ఇక్కడ విఫలమయ్యాయి. భారతీయులు ఇక్కడ విఫలమయ్యారు. కళ ఇక్కడ విఫలమైంది. ప్రతిభ ఇక్కడ విఫలమైంది. మనం ఇక్కడ విఫలమయ్యాము. పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఆడుజీవితం’ విషయంలో అన్యాయమే జరిగింది’ అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయితే.. ఈ చిత్రం 2024 మార్చి 28న రిలీజైనప్పటికీ.. గోట్ లైఫ్ 2023 లో సర్టిఫికేట్ పొందింది. కాబట్టి 2024 కి కాకుండా 2023 జాతీయ అవార్డులకు పరిగణించబడుతుంది. జాతీయ అవార్డులు సినిమా విడుదలైన సంవత్సరం కాదు.. సర్టిఫికేట్ పొందిన సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకుంటాయి.






