సత్య లాంటి యాక్టర్ మన మధ్య ఉండటం అదృష్టం.. ఆయన లేకపోతే సినిమా లేదు: డైరెక్రట్ వెంకటేష్ మహా

by Chukka Sudharani |

ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా వస్తున్న చిత్రం ‘రావు బహదూర్’.

సత్య లాంటి యాక్టర్ మన మధ్య ఉండటం అదృష్టం.. ఆయన లేకపోతే సినిమా లేదు: డైరెక్రట్ వెంకటేష్ మహా
X

దిశ, సినిమా: ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా వస్తున్న చిత్రం ‘రావు బహదూర్’. సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. బలమైన కథాంశాలతో, కంటెంట్ బేస్డ్ మూవీగా రాబోతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రమోషన్స్‌లో భాంగంగా.. తాజాగా ఈ సినిమా కోసం సత్యదేవ్ ఎంత కష్టపడ్డాడో చెప్పుకొచ్చాడు డైరెక్టర్ వెంకటేష్ మహా. ‘ఈ సినిమా కోసం సత్యదేవ్ ఎంతో కష్టపడ్డారు. అందులో ఆయన పాత్ర పరిపూర్ణంగా రావలంటే కేవలం మేకప్ కోసమే 5 గంటలు కూర్చోవాల్సి వచ్చేది. 82 రోజుల షూటింగ్ షెడ్యూల్‌లో ఆయన షూట్ 65 రోజులు జరిగితే.. ప్రతి రోజు ఐదు గంటలు మేకప్ కోసం కూర్చునే వాడు. అంత మేకప్ లోను 30 రీటేకులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఎప్పుడు విసుక్కోవడం కానీ, చిరాకు పడటం కానీ నేను చూడలేదు. నిజానికి సత్య లాంటి యాక్టర్ మన మధ్య ఉండటం మన అదృష్టం’ అని ఆయన డెడికేషన్‌పై ప్రశంసలు కురిపించాడు డైరెక్టర్.

Next Story