- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sailesh Kolanu: త్వరలో వీరప్పన్‌ను కలుద్దాం.. స్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
‘హిట్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు శైలేష్ కొలను.

దిశ, సినిమా: ‘హిట్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు శైలేష్ కొలను. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ ‘హిట్: ది సెకండ్ కేస్’ తెరకెక్కించి మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత సైంధవ్ మూవీ తీసిన శైలేష్.. ఈ ఏడాది ‘హిట్-3’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సక్సెస్ అందుకున్నాడు. ఇందులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ ప్రాంచైజీలో హిట్-4 కూడా రాబోతున్న విషయం తెలిసిందే. హిట్-3 లాస్ట్‌లో హీరో కార్తీ కనిపించగా.. ఇప్పుడు హిట్-4 ఈ హీరోతోనే తెరకెక్కించనున్నాడు శైలేష్.
ఇదిలా ఉంటే.. తాజాగా కార్తీ బర్త్‌డే కావడంతో.. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పాటు.. ఇండస్ట్రీకి చెందిన వారు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగానే కార్తీ నటిస్తున్న ‘హిట్-4’ నుంచి కూడా పోస్టర్ రిలీజ్ చేసి విష్ చేశారు చిత్ర బృందం. ఈ మేరకు డైరెక్టర్ శైలేష్ కొలను తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా కార్తీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘బ్రదర్.. మీతో ఆ ఒక్క రోజు షూటింగ్ చాలా సరదాగా ఉంది.. మీతో ఆ పూర్తి ప్రయాణంలో పాల్గొనడానికి నేను వేచి ఉండలేను. త్వరలో వీరప్పన్‌ను కలుద్దాం’ అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Happy birthday @Karthi_Offl bro. That one day shoot with you was so much fun I can’t wait to get on a full journey with you. Let’s unleash Veerappan soon. pic.twitter.com/6yOZAj8VT3
— Sailesh Kolanu (@KolanuSailesh) May 25, 2025






