హనుమాన్ ప్రొడ్యూసర్ వర్సెస్ డైరెక్టర్.. ప్రశాంత్ వర్మ నుండి రూ.100 కోట్లు డిమాండ్

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ లో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వర్సెస్ ఆ సినిమా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి మధ్య పంచాయితీ నడుస్తోంది. హనుమాన్ తరువాత తమకు అధీర, మహాకాళీ, జై హనుమాన్, బ్రహ్మరాక్షస సినిమాలు చేస్తా అని ప్రశాంత్ రూ.10.34 కోట్లు అడ్వాన్స్ తీసుకుని చెయ్యడం లేదని నిర్మాత ఫిల్మ్ చాంబర్ లో ఫిర్యాదు చేశాడు.

హనుమాన్ ప్రొడ్యూసర్ వర్సెస్ డైరెక్టర్.. ప్రశాంత్ వర్మ నుండి రూ.100 కోట్లు డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ లో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వర్సెస్ ఆ సినిమా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి మధ్య పంచాయితీ నడుస్తోంది. హనుమాన్ తరువాత తమకు అధీర, మహాకాళీ, జై హనుమాన్, బ్రహ్మరాక్షస సినిమాలు చేస్తా అని ప్రశాంత్ రూ.10.34 కోట్లు అడ్వాన్స్ తీసుకుని చెయ్యడం లేదని నిర్మాత ఫిల్మ్ చాంబర్ లో ఫిర్యాదు చేశాడు. రూ.10.23 కోట్లు ఖర్చుపెట్టించి వేరే ప్రొడ్యూసర్ దగ్గర ఉన్న అక్టోపస్ ను కొనిపించారని, అయితే ఆ సినిమా NOC ఇప్పించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఐదు సినిమాల లాస్ ఆఫ్ బిజినెస్ ఆపర్చ్యునిటీస్ ప్రశాంత్ వర్మ నుండి 200 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.

అయితే తాను ఆ సినిమాలు చేస్తా అని ఎక్కడా చెప్పలేదని,అగ్రీమెంట్లు కూడా లేవని ప్రశాంత్ వర్మ చెబుతున్నారు. అక్టోపస్ విషయంలో ఏదైనా ఇష్యూ ఉంటే ఒరిజినల్ ప్రొడ్యూసర్ తో తేల్చుకోవాలని అంటున్నారు. తనకు 15.82 కోట్లు మాత్రమే అందాయని, అవి అడ్వాన్స్ కాదు హనుమాన్ లో తన షేర్ అని చెప్పారు. హనుమాన్ నుండి తనకు ఇంకా రావాలని పేర్కొన్నారు. హనుమాన్ నుండి తనకు ఇంకా చాలా రావాలని అది ఎగ్గొట్టడానికే ఈ కథ అల్లుతున్నారని ప్రశాంత్ వర్మ ఛాంబర్ కు చెప్పారు. హనుమాన్ లో తన వాటా ఎగ్గొట్టి డార్లింగ్, సంబరాల ఏటి గట్టు, బిల్ల రంగ భాష సినిమాలకు డబ్బులు డైవర్ట్ చేశారని ప్రశాంత్ వర్మ ఆరోపించారు.

Next Story