- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో విభేదాలు.. అన్నీ కుదిరితే ఆయనతో మరో సినిమా తీస్తా అంటూ డైరెక్టర్ కామెంట్స్
పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’.. రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్సిడ్ టాక్ అందుకుంది.

దిశ, సినిమా: పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’.. రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్సిడ్ టాక్ అందుకుంది. అయితే.. ఈ సినిమాకు మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా కొన్ని అనివార్య కారణాల చేత ‘వీరమల్లు’ నుంచి ఆయన తప్పుకున్నారు. మిగిలిన సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోనే పనవ్ కల్యాణ్, క్రిష్ జాగర్లమూడి మధ్య ఏవో మనస్పర్థలు ఏర్పాడ్డాయని నెట్టింట వార్తలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే డైరెక్టర్ క్లారిటీ ఇవ్వగా.. రీసెంట్‌గా ‘వీరమల్లు’ ప్రెస్ మీట్‌లో పవన్ కల్యాణ్ కూడా క్రిష్ గురించి ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ‘ఘాటి’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటోన్న డైరెక్టర్ క్రిష్‌కు పవన్ కల్యాణ్‌తో వివాదం అంటూ ప్రశ్న ఎదురుకాగా.. మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు పవన్ కల్యాణ్‌తో నాకు విభేదాలున్నాయని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. నేను మరోసారి ఓపెన్‌గా చెప్తున్నాను.. అన్నీ అనుకూలిస్తే భవిష్యత్తులో పనవ్ కల్యాణ్‌తో సినిమా చేసేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ తెలిపారు.






