- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ghaati: లార్జెస్ట్ కాన్వాస్‌తో వస్తున్న సినిమా ఇది.. ఘాటీపై హై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తున్న డైరెక్టర్
అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘ఘాటీ’ (Ghaati)

దిశ, సినిమా: అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘ఘాటీ’ (Ghaati). విక్రమ్ ప్రభు లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ మూవీకి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ కాగా.. భారీ అంచనాల మధ్య ఈ సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీంతో తాజాగా మీడియాకు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి.
‘నా ప్రతి సినిమా ఒక అడ్వెంచర్ లాంటిదే. ఘాటీ విషయానికొస్తే.. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో శిలావతి గాంజా రకం పెరుగుతుంది. దానికోసం ఒక వ్యవస్థ పని చేస్తుంటుంది. వాటిని మోయడానికి ఉండే కూలీలను ఘాటీలని పిలుస్తారు. వాళ్ళ నేపథ్యం గురించి రచయిత చింతకింద శ్రీనివాసరావు చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. 30 పేజీల కథగా రాశారు. చాలా నచ్చింది. దాన్ని డెవలప్ చేయడం మొదలు పెట్టాను. లొకేషన్ కోసం తూర్పు కనుమలకు వెళ్లాను. అదంతా ఒక కొత్త ప్రపంచం. జీవన శైలి అంతా కొత్తగా ఉంది. ఒక కొత్త ప్రపంచం, కల్చర్‌ని చూపించే ఆస్కారం ఉండటంతో ఘాటీ మొదలుపెట్టాం.
ఘాటీ కథ పూర్తిగా ఫిక్షనల్. గంజాయి అనేది ఒక సోషల్ ఇష్యూ. ప్రభుత్వాలు ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అవన్నీ దాటి గంజాయి అనేది సమాజంలోకి వస్తుంది. సర్వైవల్ కోసం చేసినా పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఐడెంటిటీ, సర్వైవల్ థీమ్స్‌తో వస్తున్న సినిమా ఇది. సామాజిక సమస్యలపై ప్రభుత్వాలే కాకుండా పౌరులందరూ పోరాడాలి. ఘాటి కథని యాక్షన్‌తో చెబితేనే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు అలాంటివి. చాలా తీవ్రమైన పాత్రలు, తీవ్రమైన భావోద్వేగాలతో ఉంటాయి. యాక్షన్ సీక్వెన్స్‌లో ఆ ఎమోషన్ కనిపిస్తుంది. ఎమోషన్స్, పెర్ఫార్మెన్స్, లొకేషన్స్ పరంగా లార్జెస్ట్ కాన్వాస్ ఉన్న సినిమా ఇది.. అందరికి కచ్చితంగా నచ్చుతుంది’ అని తెలిపారు.






