"నేను శైలజ" కథను ఆ స్టార్ హీరోయిన్ కు చెప్పా.. కానీ: డైరెక్టర్ కిషోర్ తిరుమల

by Ajay Maddhiboyina |

రామ్, కీర్తి సురేష్ హీరోగా న‌టించిన నేను శైలజ సినిమా అప్ప‌ట్లో సైలెంట్ గా వ‌చ్చి సూప‌ర్ హిట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర‌వాత‌నే కీర్తి సురేష్ ఎక్కువ‌మందికి ద‌గ్గ‌రైంది. త‌ర‌వాత కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

నేను శైలజ కథను ఆ స్టార్ హీరోయిన్ కు చెప్పా.. కానీ: డైరెక్టర్ కిషోర్ తిరుమల
X

దిశ‌, వెబ్ డెస్క్: రామ్, కీర్తి సురేష్ హీరోగా న‌టించిన నేను శైలజ సినిమా అప్ప‌ట్లో సైలెంట్ గా వ‌చ్చి సూప‌ర్ హిట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర‌వాత‌నే కీర్తి సురేష్ ఎక్కువ‌మందికి ద‌గ్గ‌రైంది. త‌ర‌వాత కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే నిజానికి ఈ సినిమా క‌థ ముందుగా కీర్తి సురేష్ వ‌ద్ద‌కు వెళ్ల‌లేద‌ని చాలా మందికి తెలియ‌దు. ఈ విష‌యాన్ని నేను శైల‌జ డైరెక్ట‌ర్ కిశోర్ తిర‌మ‌ల తాజాగా వెల్ల‌డించారు. నేను శైల‌జ సినిమా కోసం మొద‌ట కీర్తి సురేష్ ఆడిష‌న్స్ లో న‌చ్చింద‌ని చెప్పారు. కానీ నిర్మాత‌లు ఓ స్టార్ హీరోయిన్ ను సంప్ర‌దించి ఆమెకు క‌థ చెప్ప‌మ‌న్నార‌ని అన్నారు.

ఆ హీరోయిన్ పాత్ర‌కు సెట్ కాదు అనిపించి తాను క‌థ‌ను స‌రిగ్గా చెప్పలేద‌ని అన్నారు. క‌థ విన్న త‌ర‌వాత హీరోయిన్ త‌న‌కు న‌చ్చ‌లేద‌ని చెప్ప‌డంతో హ‌మ్మ‌య్య అనుకున్నాన‌ని చెప్పారు. త‌ర‌వాత కీర్తితోనే సినిమా చేశామ‌న్నారు. కొత్త హీరోయిన్.. అనుకున్న‌ట్టుగా అమాయ‌క‌పు ముఖం కాబట్టి కీర్తి సురేష్ అయితేనే పాత్ర‌కు న్యాయం చేస్తుంద‌ని భావించిన‌ట్టు తెలిపారు. ఇక ఈ సినిమా పాట‌లు, స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం త‌ర‌వాత కిశోర్ తిరుమ‌ల కూడా అవ‌కాశాలు అందుకున్నారు.

Next Story