- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Shankar: తెలుగులో బాక్సింగ్ పిక్చర్ ఆ స్టార్ హీరోతోనే చేస్తా.. డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్స్ వైరల్
‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ (Naslen) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘అలప్పజ జింఖానా’.

దిశ, సినిమా: ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ (Naslen) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘అలప్పజ జింఖానా’. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్(Sports backdrop)లో తెరకెక్కిన ఈ చిత్రానికి జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుభీష్ కన్నంచెరీలు కలిసి నిర్మించగా.. ఖలీద్ రెహమాన్ (Khalid Rahman) దర్శకత్వం వహించాడు. ఇందులో నస్లెన్‌తో పాటు లుక్మాన్ అవరన్, గణపతి, బేబీ జీన్, సందీప్ ప్రదీప్, ఫ్రాంకో ఫ్రాన్సిస్, శివ హరిహరన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించిన ఈ మూవీ రీసెంట్‌గా మలయాళంలో రిలీజై బాక్సాఫీస్ హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఏప్రిల్ 25న ‘జింఖానా’ అనే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం.. వరుసగా ఈవెంట్స్ చేస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన ఓ ఈవెంట్‌కి స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గెస్ట్‌గా వచ్చారు.
ఇందులో భాగంగా.. ‘తెలుగులో మన యాక్టర్స్‌లో బాక్సింగ్ ఫిలిమ్ తీయాలంటే ఈ యాక్టర్‌తో తీస్తారు’ అని యాంకర్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar)ను ప్రశ్నిస్తుంది. దీనిపై డైరెక్టర్ స్పందిస్తూ.. ‘తెలుగులో బాక్సింగ్ పిక్చర్ తీయాలంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)తో చేస్తాను’ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఆ డైలాగ్ విన్నా నెటిజన్లు గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.






