సీన్లు కాపీ కొట్టాలనే ఆలోచనే నాకు ఉండదు..కింగ్ డమ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

by Ajay Maddhiboyina |

సీన్లు కాపీ కొట్టాలనే ఆలోచన తనకు ఉండదని కింగ్‌డమ్ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి అన్నారు. అలా కాపీ కొట్టడం తనపై హీరో, నిర్మాత పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోవడమే అని చెప్పారు.

సీన్లు కాపీ కొట్టాలనే ఆలోచనే నాకు ఉండదు..కింగ్ డమ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: సీన్లు కాపీ కొట్టాలనే ఆలోచన తనకు ఉండదని కింగ్‌డమ్ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి అన్నారు. అలా కాపీ కొట్టడం తనపై హీరో, నిర్మాత పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోవడమే అని చెప్పారు. కింగ్ డమ్ సినిమా క్లైమాక్స్ గురించి ఆలోచించిన తరవాత దానిని ఆడియన్స్‌కే వదిలేశానని చెప్పారు. అది కాన్ఫిడెన్స్ ఓ లేదంటే విధి నమ్మడమో తెలియదని అన్నారు. సినిమా తీసేముందు మొదట తనకు వచ్చిన ఐడియాను కథను మొదలు పెట్టి ఆ తరవాత ఆ కథను పూర్తిగా రాసుకుంటానని చెప్పారు.

కింగ్ డమ్ కథ పూర్తయ్యే సరికి స్టోరీలో ఒక నాయకుడు ప్రజల కంటే భూమి ముఖ్యం అని భావిస్తే మరొకరు భూమి కంటే ప్రజలే ముఖ్యం అని భావిస్తారని చెప్పారు. అంతే కాకుండా తన మొదటి రెండు సినిమాలు మళ్లీ రావా, జెర్సీలకు క్రిటిక్స్ ప్రశంసలు అందాయని కానీ ఆడియన్స్ నుండి పెద్దగా రెస్పాన్స్ రాలేదన్నారు. కింగ్ డమ్‌కు అందుకు భిన్నంగా ప్రజలకు సినిమా నచ్చింది కానీ క్రిటిక్స్ కొన్ని సన్నివేశాలు ఇంకా బాగుండాల్సిందని అభిప్రాయపడ్డారని చెప్పారు.

Next Story