Lokah : బ్లాక్ బస్టర్ హిట్ ‘లోకా’ నెక్ట్స్ పార్ట్స్‌పై బిగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

by Chukka Sudharani |

చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది ‘లోకా: చాప్టర్ 1 చంద్ర’.

Lokah : బ్లాక్ బస్టర్ హిట్ ‘లోకా’ నెక్ట్స్ పార్ట్స్‌పై బిగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
X

దిశ, సినిమా: చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది ‘లోకా: చాప్టర్ 1 చంద్ర’. కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో.. నస్లేస్, టోవినో థామస్, మమ్ముట్టి, సాండీ, అన్నా బెన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించిన ఈ చిత్రానికి డామినిక్ దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్ నిర్మించాడు. ఆగస్టు 28న రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ సినిమాకు పార్ట్ 2 కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రజెంట్ ‘లోకా: చాప్టర్ 1 చంద్ర’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు చిత్ర బృందం.

ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చాప్టర్ 2, చాప్టర్ 3 పై కూడా సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ డామినిక్. మీ నెక్ట్స్ సినిమా ఏంటని యాంకర్ ప్రశ్నించగా.. ‘కచ్చితంగా లోకా చాప్టర్ 2తోనే వస్తాను’ అని తెలిపారు. అలాగే.. లోకా తదుపరి భాగాలలో ప్రధాన పాత్రల గురించి క్లారిటీ ఇస్తూ.. లోకా చాప్టర్ 2లో టోవినోథామస్, లోకాచాప్టర్ 3లో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తారని చెప్పుకొచ్చాడు. దీంతో పాటు కొన్ని వారాల తర్వాత స్క్రిప్ట్ పనులు స్టార్ట్ కానున్నాయని అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్. లింక్

Next Story