- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏ రాజకీయనాయకుడికి నేను బానిసను కాదు..డైరెక్టర్ దేవకట్టా సెన్సేషనల్ కామెంట్స్
టాలీవుడ్ డైరెక్టర్ దేవకట్టా సెన్సేషనల్ కామెంట్లు చేశారు. తాను రాజకీయనాయకుడికి బానిసను కాదన్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్ దేవకట్టా సెన్సేషనల్ కామెంట్లు చేశారు. తాను రాజకీయనాయకుడికి బానిసను కాదన్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజుల్లో ప్రజలు ఏం చేసినా అతిగా అభిమానిస్తూ, ప్రశంసలు కురిపిస్తూ బానినలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. కానీ రాజకీయాలను తాను అంశాల వారిగా చూస్తానని అన్నారు. ఇది ప్రజలకు మంచి చేస్తుందా లేదా అని మాత్రమే ఆలోచిస్తానని చెప్పారు. అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ లాంటి గొప్ప మల్టీ స్టారర్ చూసినట్టయితే ప్రతి హీరోకు ఎలివేషన్ ఇవ్వాల్సి వస్తుందన్నారు.
మల్టీస్టారర్ సినిమా చేయడం దర్శకుడికి పెద్ద టాస్క్ అని చెప్పారు. తమ హీరోకు తప్పకుండా ఎలివేషన్స్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటారని అన్నారు. తక్కవ చేస్తే మా హీరోకి తక్కువ ఎలివేషన్స్ ఇచ్చారని నిరాష చెందుతారని వ్యాక్యానించారు. ఇదిలా ఉంటే దేవకట్టా ప్రస్తుతం మాయసభ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఆగస్ట్ 7వ తేదీ నుండి ఈ సిరీస్ సోనీలివ్ లో ప్రసారం కానుంది. చంద్రబాబు, వైఎస్ఆర్ స్నేహితులు అయితే ఎలా ఉండేది అనే పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ సిరీస్ ఉండబోతుందని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.






