- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు దిల్ రాజు తమ్ముడి క్షమాపణ
గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాపై దిల్ రాజు సోదరుడు శిరీష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాపై దిల్ రాజు సోదరుడు శిరీష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. గేమ్ ఛేంజర్ వల్ల చాలా నష్టపోయామని.. కనీసం రామ్ చరణ్(Ram Charan) ఫోన్ కూడా చేయలేదని శిరీష్(Sirish) మట్లాడిన మాటలు వివాదానికి తెరలేపాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై రామ్ చరణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరోసారి రామ్ చరణ్‌పై, గేమ్ ఛేంజర్‌పై తప్పుగా మాట్లాడితే బాగోదని హెచ్చరించారు. తాజాగా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహంపై నిర్మాత శిరీష్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. ‘అందరికీ నమస్కారం.. నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అపార్థాలకు దారి తీసి.. దాని వలన కొందరు మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసింది. "Game Changer” సినిమా కోసం మాకు "Global Star" రామ్ చరణ్ తన పూర్తి సమయం, సహకారం అందించారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ళ నుండి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి, రామ్ చరణ్ మరియు మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడము. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే... క్షమించండి’ అని సోషల్ మీడియా వేదికగా శిరీష్ విజ్ఞప్తి చేశారు.






