- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్రాంతికి లక్ లో పడ్డ దిల్ రాజ్..ఏకంగా 3 సినిమాలు హిట్ !
Dil Raju: ఒకే సంక్రాంతికి ఇలా మూడు సినిమాలు హిట్లు కొట్టడం చాలా అరుదుగా జరుగుతుందని కూడా చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: ఈ సంక్రాంతికి తెలుగు సినిమాలు సందడి చేశాయి. మొత్తం ఐదు సినిమాలు రిలీజ్ కాగా.. 4 సినిమాలు మాత్రం బంపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ది రాజ సాబ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. కానీ మిగిలిన నాలుగు సినిమాలకు దాదాపు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సంక్రాంతి బరిలో విజయం సాధించిన సినిమాల వివరాలు ప్రకటించారు నిర్మాత దిల్ రాజు.
సంక్రాంతి హిట్ సినిమాలు ఇవే
ఈ సంక్రాంతికి ఐదు సినిమాలు రిలీజ్ అయితే మూడు సినిమాలు బంపర్ హిట్ అయినట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఆ మూడు సినిమాలు కూడా తెలంగాణలో తానే డిస్ట్రిబ్యూట్ చేసినట్లు వివరించారు. చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు, నవీన్ నటించిన అనగనగా ఒక రాజు, శర్వా నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమాలకు ప్రత్యేక శుభాకాంక్షలు కూడా తెలిపారు దిల్ రాజు.
ఒకే సంక్రాంతికి ఇలా మూడు సినిమాలు హిట్లు కొట్టడం చాలా అరుదుగా జరుగుతుందని కూడా చెప్పుకొచ్చారు. AP, తెలంగాణలో ఈ నారీ నారీ నడుమ మురారి సినిమాకు స్క్రీన్లు తక్కువగానే వచ్చాయి, చివర్లో విడుదల కావడంతో ఈ సమస్య వచ్చిందన్నారు. నైజాం కానీ, వైజాగ్ కానీ మేమే రిలీజ్ చేసినా 100% థియేటర్లు ఇవ్వలేకపోయామన్నారు. అయితే రెండో వారంలో స్క్రీన్లు పెరుగుతున్నాయని చెప్పుకొచ్చారు దిల్ రాజు.






