- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dil Raju: చిరంజీవి గారు చెప్పిన వినలేదు.. దాంతో సినిమా రిజల్ట్ అలా అయింది.
దిల్ రాజు మాట్లాడుతూ… జోష్ కథను మొదట చిరంజీవి గారికి వినిపించాను. కానీ ఆయన అది వర్కౌట్ కాదని చెప్పారు. అయినప్పటికీ నేను ధైర్యంతో ఆ సినిమా చేశాను. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదని చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు కొంతకాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో చిరంజీవి గారు స్టార్ హీరో కావడానికి అసలు కారణం ఏమిటి, ఆయన స్టోరీ సెలక్షన్ ఏ రేంజ్‌లో ఉంటుందో, అలాగే ఆయన చెప్పిన మాట వినకపోవడం వల్ల తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి క్లియర్‌గా వివరించారు. దిల్ రాజు మాట్లాడుతూ… “మగధీర సినిమా పూర్తి అయిన తర్వాత చరణ్‌తో సినిమా చేయాలని అనుకున్నాను. అందులో భాగంగా ‘జోష్’ కథను మొదట రామ్ చరణ్‌కి వినిపించాను.
ఆయన ‘బాగానే ఉంది, నాన్న గారికి చెప్పండి’ అన్నారు. తర్వాత చిరంజీవి గారికి ఆ కథను వినిపించాను. కథ మొత్తం విన్న ఆయన ‘కాస్త టైం ఇవ్వండి, తర్వాత చెబుతాను’ అన్నారు. కొన్ని రోజుల తర్వాత చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి, ‘కథ బాగానే ఉంది. కానీ నాకు ఎక్కడో అది తేడా కొడుతున్నట్లు అనిపిస్తోంది. చరణ్‌తో ఆ సినిమా వర్కౌట్ కావడం కష్టమే. మీరు బాగా ఆలోచించి ఆ కథ విషయంలో నిర్ణయం తీసుకోండి’ అని చెప్పారు. ఆ కథను చిరంజీవి గారికి వినిపించే ముందు నేను అనేక మందికి వినిపించాను. వారంతా ‘స్టోరీ సూపర్‌గా ఉంది, కచ్చితంగా హిట్ అవుతుంది’ అన్నారు.
అందుకే నేను ‘చిరంజీవి గారు ఇలా ఎందుకు చెప్పారు?’ అని అనుకున్నాను. ఆ తర్వాత నాగార్జున గారికి ఆ కథను వినిపించాను. ఆయనకు స్టోరీ బాగా నచ్చడంతో, నాగచైతన్యను ఆ కథతో లాంచ్ చేసే బాధ్యత నాకు అప్పగించారు. సినిమా పూర్తయ్యి విడుదలైంది. కానీ ఎందుకో ఆ చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చి, బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయింది. అప్పుడు నాకు చిరంజీవి గారి నిర్ణయంపై నమ్మకం పెరిగింది. ఆయన ఎందుకు స్టార్ హీరో అయ్యారో అర్థమైంది. ఒక కథను ఆయన ఎన్నో కోణాల్లో విశ్లేషించి నిర్ణయం తీసుకుంటారని నాకు అనిపించింది” అని దిల్ రాజు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.






