- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనిల్ ఏమన్నా అన్నాడా.. అంటే చెప్పు నెక్స్ట్ సినిమా నుండి తీసి పడేద్దాం.. చిరంజీవి స్వీట్ వార్నింగ్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), నయనతార(Nayanatara) జంటగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu) మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), నయనతార(Nayanatara) జంటగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu) మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక దీనికి అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించగా.. విక్టరీ వెంకటేష్(Venkatesh) కీలక పాత్రలో అలరించారు. అలాగే షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు.
ఇప్పటికీ ఈ సినిమా మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (రీజనల్ ఫిల్మ్స్) సెలబ్రేషన్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘భీమ్స్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు.. ఏంటి డల్‌గా ఉన్నావ్.. అనిల్ ఏమన్నా అన్నాడా.. ఏమన్నా అంటే చెప్పు.. నెక్స్ట్ సినిమా నుండి తీసి పడేద్దాం .. నువ్వు ఎంత చెబితే అంత’ అని అనిల్ రావిపూడికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం చిరంజీవి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






