- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTTలోకి వచ్చేస్తోన్న 'ధురంధర్'.. ఎప్పుడు, ఎక్కడంటే?
ధురంధర్ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈనెల 30వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: రణవీర్ సింగ్ లేటెస్ట్ గా నటించిన సినిమా ధురంధర్. ఈ సినిమా రిలీజ్ అయిన నుంచి ఇప్పటి వరకు అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకు వెళ్తోంది. ఇప్పటి వరకు ఈ ధురంధర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అయితే అలాంటి ధురంధర్ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈనెల 30వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియాలో ఇప్పటికే ఎనిమిది వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన తొలి హిందీ సినిమాగా ధురంధర్ చరిత్ర సృష్టించింది. కాగా ఈ ధురంధర్ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా నటించగా అక్షయ్ ఖన్నా ప్రత్యేక పాత్రలో మెరిశారు. 2025 డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అయిన ధురంధర్ సినిమాకు ఆదిత్యధర్ దర్శకత్వం వహించారు. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.
Read More..
యాక్షన్ మోడ్ ఆన్.. ప్రజెంట్ నీల్- ఎన్టీఆర్ మూవీ షూటింగ్ జరుగుతుంది అక్కడే..!






