- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధురంధర్ ఖాతాలో మరో రికార్డు.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన నిర్మాణ సంస్థ
ఎలాంటి హడావిడి, పెద్దగా ప్రమోషన్స్ లేకుండా, చాలా తక్కువ అంచనాలతో కొన్ని దేశాలు మినహా.. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలైన ధురంధర్ భారీ విజయాన్నందుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఎలాంటి హడావిడి, పెద్దగా ప్రమోషన్స్ లేకుండా, చాలా తక్కువ అంచనాలతో కొన్ని దేశాలు మినహా.. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలైన ధురంధర్ భారీ విజయాన్నందుకుంది. సినీ క్రిటిక్స్ ప్రశంసలు అందుకుని సరికొత్త రికార్డులు సృష్టించింది. తాజాగా ఈ సినిమా మరో మైలురాయిని చేరుకుందని చిత్ర నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. అత్యధిక వసూళ్లు సాధించిన సింగిల్ లాంగ్వేజ్ సినిమాగా ధురంధర్ సరికొత్త రికార్డు సృష్టించిందని పేర్కొంది. డైరెక్టర్ ఆదిత్యధర్ తో పాటు సినిమాలో నటించినవారందరికీ అభినందనలు తెలిపింది. ఈ సినిమాలో డైరెక్టర్ కథను వెల్లడించిన తీరు.. భారతీయ సినిమాకు కొత్త ప్రమాణాన్ని నిర్దేశించాయని, రానున్న ఎన్నో సినిమాలకు ఇది స్ఫూర్తినిస్తుందని జియో స్టూడియోస్ పేర్కొంది.
సినిమా విడుదలైన నెలరోజుల్లో భారత్ లో రూ.831.40 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించింది. సింగిల్ లాంగ్వేజ్ లో రిలీజైన సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ వసూళ్లలో తొలిరోజున ఇండియాలో రూ.28.60 కోట్లు రాగా.. ఫస్ట్ వీక్ ముగిసే సరికి రూ.218 కోట్లు, సెకండ్ వీక్ రూ.479.50 కోట్లు, 15 రోజులకు రూ.500 కోట్లు వసూళ్లు రాబట్టింది. 32వ రోజున రూ.5.40 కోట్లు, 33వ రోజున రూ.5.70 కోట్ల వసూళ్లు వచ్చినట్లు చిత్రయూనిట్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ రూ.1220 కోట్లు వసూలు చేసింది.






