‘ధురంధర్-2’ బాక్సాఫీస్ సునామీ.. ప్రీమియర్ షోలతోనే రూ.52 కోట్ల రికార్డు!

by Kema Shiva Kumar |

బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘ధురంధర్ 2’ కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. కేవలం ప్రీమియర్ షోల ద్వారానే రూ.కోట్లు వసులు చేసి సరికొత్త చరిత్రను లిఖించింది.

‘ధురంధర్-2’ బాక్సాఫీస్ సునామీ.. ప్రీమియర్ షోలతోనే రూ.52 కోట్ల రికార్డు!
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ (Ranveer Singh) నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ (Dhurandhar: The Revenge) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిం చింది. కేవలం పెయిడ్ ప్రీమియర్ షోల ద్వారానే ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో గతంలో ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టేసింది. ట్రేడ్ అనలిస్టుల సమాచారం ప్రకారం.. మార్చి 18న జరిగిన ప్రీమియర్ షోల ద్వారా ‘ధురంధర్ 2’ ఏకంగా రూ.52.71 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇందులో ఒక్క హిందీ వెర్షన్ నుంచే అత్యధికంగా రూ.44 కోట్ల నెట్ వసూళ్లు రావడం విశేషం. దీంతో పెయిడ్ ప్రీమియర్ల ద్వారా అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా ఇది నిలిచింది.

పవన్ కళ్యాణ్ ‘OG’ రికార్డు బ్రేక్..

ఇప్పటి వరకు ఈ రికార్డు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ రూ.25 కోట్లు, బాలీవుడ్ హారర్ కామెడీ ‘స్త్రీ 2’ రూ.10 కోట్లు పేరిట ఉండగా, రణవీర్ సింగ్ ఆ రికార్డులను భారీ తేడాతో అధిగమించారు. ధురంధర్ ఫస్ట్ హాఫ్ మొదటి రోజు వసూలు చేసిన రూ.33 కోట్లను, ఈ సీక్వెల్ కేవలం ప్రీమియర్ షోల ద్వారానే దాటేయడం సినిమాపై ఉన్న అంచనాలను తెలియజేస్తోంది.

సాంకేతిక సమస్యలు ఉన్నా..

దేశవ్యాప్తంగా సుమారు 12,292 షోలలో ఈ ప్రీమియర్లు ప్రదర్శితమయ్యాయి. అయితే, కంటెంట్ డెలివరీలో జాప్యం కారణంగా తెలుగు, తమిళ వెర్షన్ల షోలు ఆలస్యంగా ప్రారంభమవ్వగా, కన్నడ, మలయాళ షోలు రద్దయ్యాయి. అయినప్పటికీ, హిందీ వెర్షన్ ద్వారా వచ్చిన వసూళ్లతోనే ఈ చిత్రం చారిత్రాత్మక రికార్డును నెలకొల్పింది.

Next Story