- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dhruv Vikram: మణిరత్నం డైరెక్షన్‌లో ధ్రువ్‌విక్రమ్ సినిమా ఫిక్స్.. హీరోయిన్ ఎవరంటే?
స్టార్ హీరో విక్రమ్ వారసత్వంగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ఆయన కొడుకు ధ్రువ్ విక్రమ్.

దిశ, సినిమా: స్టార్ హీరో విక్రమ్ వారసత్వంగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ఆయన కొడుకు ధ్రువ్ విక్రమ్. ‘ఆదిత్య వర్మ’ మూవీతో వెండితెరకు హీరోగా పరిచయమైన ధ్రువ్.. మొదటి చిత్రంతో నటనతో పర్వలేదు అనిపించుకున్నా సినిమా మాత్రం హిట్ అందుకోలేదు. తర్వాత తండ్రి విక్రమ్‌తో కలిసి మహాన్ సినిమాలో నటించాడు. కార్తీక్ సుబ్బురాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈమూవీ కూడా ధ్రువ్ సినీ కెరీర్‌కు కలిసి రాలేదు. ఇలా నాలుగు ఏళ్లుగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ హీరో.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం పెద్ద ప్లానే వేసినట్లు తెలుస్తోంది.
ధృవ్ విక్రమ్ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. లవ్ & యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ నవంబర్ మొదటి వారంలో ప్రారంభమవుతుందని తెలుస్తుండగా.. ఇందులో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తికాగా.. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తుంది. లింక్






