- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దేవగుడి’.. ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణ రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం ‘దేవగుడి’.

దిశ, సినిమా : పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణ రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం ‘దేవగుడి’. ఈ సినిమాలో అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించగా.. ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ క్రమంలోనే మూవీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి.. ‘మా సినిమా టీజర్‌ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేసి సపోర్ట్ అందించారు. ఈ చిత్రంలో స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి అన్ని అంశాలు ఆకట్టుకుంటాయి. నిజ జీవిత ఘటనల ఆధారంగా మంచి కథా కథనాలతో ఈ సినిమాను రూపొందించాను. స్క్రీన్ ప్లే చాలా షార్ప్‌గా ఉంటుంది. ఈ చిత్రానికి కావాల్సినంత బడ్జెట్ పెట్టి నిర్మించాం. ‘దేవగుడి’ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. ఈ నెల 30న మా మూవీని థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నాం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి సెంటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నాం. సాధారణ టికెట్ రేట్స్‌తో మూవీ అందుబాటులో ఉంటుంది. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్స్‌లోనే సినిమాను చూడండి’ అని కోరాడు.






