- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం.. తొలి ఇండియన్‌గా చరిత్ర
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరో అరుదైన గౌరవాన్ని తన ఖాతాలో వేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika padukone) మరో అరుదైన గౌరవాన్ని తన ఖాతాలో వేసుకుంది. భారతీయ సినీ రంగానికి గర్వకారణంగా నిలిచేలా, హాలీవుడ్ ప్రఖ్యాత 'వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ (Walk of Fame star)' అవార్డు కోసం ఎంపికయ్యారు. అంటే.. లాస్ ఏంజెలెస్‌లోని ఈ ప్రఖ్యాత ఫుట్‌పాత్‌పై ఆమె పేరు చెక్కించుకునే అరుదైన గౌరవాన్ని అందుకుంటున్నారు. దీంతో దీపిక ఈ గౌరవాన్ని అందుకోనున్న తొలి భారతీయ నటిగా చరిత్ర సృష్టించారు.
హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ క్లాస్ ఆఫ్ 2026లో భాగంగా ఆమె పేరును మోషన్ పిక్చర్ కేటగిరీలో ప్రకటించారు. ఈ జాబితాలో మొత్తం 35 మంది ప్రముఖులు వివిధ రంగాల్లో (సినిమా, టీవీ, మ్యూజిక్, బ్రాడ్‌వే, కామెడీ) నుంచి ఎంపికయ్యారు. దీపికతో పాటు ఈ జాబితాలో డెమి మూర్, ఎమిలీ బ్లంట్, రాచెల్ మెక్‌అడమ్స్, రామీ మలెక్, టిమోథీ షాలమె వంటి అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన నటులు ఉన్నారు. కాగా, ప్రతి సంవత్సరం వందలాది నామినేషన్ల నుంచి అత్యుత్తములను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది ఎంపికైన వారిలో స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్, టీవీ, థియేటర్, సంగీతం, సినిమా ఇలా ఐదు విభాగాల నుంచి ప్రతిభావంతులున్నారు.
దీపిక పదుకొణె 2017లో విడుదలైన 'XXX: Return of Xander Cage' సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె హాలీవుడ్ స్టార్ విన్ డీజిల్ సరసన నటించారు.ఈ అరుదైన గౌరవం భారతీయ సినిమాకు, ముఖ్యంగా మహిళా నటుల ప్రతిష్ఠకు ప్రపంచ వేదికపై మరింత వెలుగులు నింపింది. ఇక ఈ సందర్భంగా ఆమెకు సిని ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలుత చెబుతున్నారు. ఇక ప్రస్తుతం దీపికా బ్రహ్మాస్త్ర పార్ట్ టూ: దేవ్, కింగ్, కల్కి 2898 AD సీక్వెల్, పఠాన్ సీక్వెల్ తదితర మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నారు.






