‘డెవిడ్ భాయ్’ టూ కాస్ట్లీ.. నాలుగు రోజులకు ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

by Gantepaka Srikanth |   (  Updated:2025-03-16 10:08:32  IST  )

యంగ్ హీరో నితిన్(Nithiin), శ్రీలీల(Sreeleela) కాంబినేషన్‌లో వస్తోన్న రాబిన్‌హుడ్ సినిమా(Robin Hood Movie) కోసం కేవలం సినీ ప్రేక్షకులే కాకుండా.. క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘డెవిడ్ భాయ్’ టూ కాస్ట్లీ.. నాలుగు రోజులకు ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో నితిన్(Nithiin), శ్రీలీల(Sreeleela) కాంబినేషన్‌లో వస్తోన్న రాబిన్‌హుడ్ సినిమా(Robin Hood Movie) కోసం కేవలం సినీ ప్రేక్షకులే కాకుండా.. క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డెవిడ్ వార్నర్ నటిస్తుండటమే కారణం. ఐపీఎల్‌(IPL)లో సన్ రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad) తరపున సుదీర్ఘంగా ఆడిన వార్నర్.. తెలుగు హీరోలను ఇమిటేట్ చేసి చాలా దగ్గరయ్యాడు. ముఖ్యంగా పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ స్టైల్ అండ్ స్వాగ్‌ను రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసేవాడు. ఆ తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్ సహా అనేక మంది హీరోలను ఇమిటేట్ చేశాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆయన టాలీవుడ్‌(Tollywood)లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

నితిన్, శ్రీలీల కాంబినేషన్‌లో వస్తున్న రాబిన్ హుడ్ చిత్రం(Robin Hood Movie)లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే.. ఇందుకు ఆయన భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఆయన నాలుగు రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నందుకు రూ.3 కోట్లు ఛార్జ్ చేయగా, ప్రమోషన్స్ కోసం అదనంగా మరో రూ.1 కోటి తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి డెవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్‌ రిలీజ్ చేయగా.. ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నది. ఈ మార్చి 28వ తేదీన గ్రాండ్‌గా రాబిన్‌హుడ్ రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు.

Read More..

పవన్ కళ్యాణ్ దమ్మున్న నాయకుడు.. నెట్టింట వైరల్ అవుతున్న టాలీవుడ్ హీరోయిన్ సంచలన ట్వీట్

Next Story