- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డేవిడ్ రెడ్డి టీజర్ విడుదల తేదీ వచ్చేసింది
మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా మే 20న డేవిడ్ రెడ్డి సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: మంచు మనోజ్ ప్రస్తుతం దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటి తెరకెక్కిస్తున్న డేవిడ్ రెడ్డి చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయనకు జోడిగా మారియా రియాబోషప్క కనిపించనుంది. హనుమ రెడ్డి యక్కంటి ఈ చిత్రంతోనే దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. కొంతకాలం క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ మూవీ బృందం టీజర్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో మంచు మనోజ్ రైల్వే ట్రాక్ మధ్యలో నిలబడి కనిపించారు. ఆయనను వెనుక వైపు నుంచి చూపించడం ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలను బట్టి చూస్తే ఈ మూవీ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అర్థమవుతోంది. టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే సినిమాపై మరింత అంచనాలు పెరిగే అవకాశం ఉంది. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్లపై భరత్ మోతుకూరి, వెంకట్ రెడ్డి నల్లాగంగుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.






