ఆ ఫ్లాట్‌ఫామ్‌లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన డార్లింగ్

by Pulgam srinivas |

బుక్ మై షో ప్లాట్‌ఫామ్‌లో కేవలం 4 రోజుల్లోనే డార్లింగ్ చిత్రానికి సంబంధించిన 265K టికెట్లు అమ్ముడైనట్లు మూవీ బృందం ప్రకటించింది.

ఆ ఫ్లాట్‌ఫామ్‌లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన డార్లింగ్
X

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం డార్లింగ్. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2010లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమాను పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్‌లో భాగంగా ఈ మూవీకి సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఓపెన్ కావడమే ఆలస్యం, భారీ స్థాయిలో బుకింగ్స్ నమోదయ్యాయి. ఇప్పటికే కలెక్షన్ల విషయంలో రీ రిలీజ్ చిత్రాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న ఈ మూవీ, తాజాగా ఓ ఆల్ టైమ్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. బుక్ మై షో ప్లాట్‌ఫామ్‌లో కేవలం 4 రోజుల్లోనే ఈ చిత్రానికి సంబంధించిన 265K టికెట్లు అమ్ముడైనట్లు, ఇప్పటివరకు రీ రిలీజ్‌లో భాగంగా ఏ సినిమాకూ ఈ స్థాయిలో టికెట్లు ఈ ప్లాట్‌ఫామ్‌లో అమ్ముడుకాలేదని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి మంచి టికెట్ బుకింగ్స్ కొనసాగుతున్నాయి.దీనిని బట్టి చూస్తే, మరికొన్ని రోజులు పాటు ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. శ్రద్ధా దాస్ ఇందులో కీలక పాత్రలో నటించగా, ప్రభు, ఎమ్.ఎస్. నారాయణ, ముకేష్ రిషి, చంద్రమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కోట శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్, శ్రీనివాస రెడ్డి, తులసి, చరణ్‌దీప్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.




Next Story