- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాన్స్ మాస్టర్ పండు కారుకు ఘోర ప్రమాదం.. రెండు కాళ్లు ఫ్రాక్చర్!
విశాఖ జిల్లా ఆనందపురం హైవేపై అర్ధరాత్రి ఘోర ప్రమాదం. ఆగి ఉన్న వాహనాలను కోళ్ల వ్యాన్ ఢీకొట్టడంతో డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు టీవీ పరిశ్రమలో తనకంటూ మంచి పేరును సంపాదించుకున్న డాన్స్ మాస్టర్ పండు కారు ఉహించని ప్రమాదానికి గురైంది. విశాఖపట్నం జిల్లాలో అర్ధరాత్రి వేళ ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పండు (Pandu Master) తీవ్రంగా గాయపడ్డారు. ఆనందపురం మండలం లోడగల వారి పాలెం జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. హైవేపై అప్పటికే ఆగి ఉన్న రెండు వాహనాలను, అత్యంత వేగంగా వచ్చిన ఒక బొలెరో కోళ్ల వ్యాన్ బలంగా ఢీకొట్టింది.
ఈ భీకర ప్రమాదంలో డాన్స్ మాస్టర్ పండుకు సంబంధించిన రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనతో పాటు వాహనంలో ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి వేళ డ్రైవర్ నిద్రమత్తు, అలాగే వాహనం అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద తీవ్రతను పరిశీలించి, ప్రమాదానికి గురైన మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.






