- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమాలకు దగ్గుబాటి హీరో గుడ్ బై.. కారణం ఇదే ?
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ( Venkatesh) షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరో ఏడాది కాలం వరకు కొత్త

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ( Venkatesh) షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరో ఏడాది కాలం వరకు కొత్త ప్రాజెక్టులకు దూరంగా ఉండబోతున్నాడట విక్టరీ వెంకటేష్. అంటే వచ్చే సంక్రాంతికి కూడా... విక్టరీ వెంకటేష్ ఏ సినిమా కూడా రిలీజ్ చేయబోడన్నమాట. మొన్నటికి మొన్న సంక్రాంతి (Ponagal) సమయంలో.... విక్టరీ వెంకటేష్ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం ( Sankranthiki vasthunnam) అంటూ.. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో వచ్చిన విక్టరీ వెంకటేష్.. 300 కోట్ల వరకు కొల్లగొట్టాడు.
సాధారణంగా విక్టరీ వెంకటేష్ అంటేనే ఫ్యామిలీ హీరో. దానికి తోడు ప్రతి సినిమాలో విక్టరీ వెంకటేష్ కామెడీ అదిరిపోతుంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అయితే ప్రతి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ విక్టరీ వెంకటేష్ వెకేషన్ లో భాగంగా విదేశాలకు వెళ్తాడు. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయిన తర్వాత... ఆ విషయంలో వెనక్కి తగ్గాడు.
దీనికి ప్రత్యేక కారణం ఉందట. సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయిన తర్వాత... మోకాలి గాయం కారణంగా విక్టరీ వెంకటేష్ బాధపడుతున్నారని సమాచారం. దీంతో వైద్యుల సూచనల మేరకు రెస్ట్ తీసుకుంటున్నారట వెంకటేష్. అందుకే కొత్త ప్రాజెక్టులకు... విక్టరీ వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని సమాచారం. ఇక ఈ ఏడాది చివరి వరకు ఇదే పరిస్థితి ఉంటుందట. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, UV క్రియేషన్స్ అలాగే స్వప్న సినిమాస్ సంస్థలతో సినిమాలు చేయబోతున్నాడట వెంకటేష్.






