- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్యాడీ ఈజ్ హోమ్.. టాక్సిక్ నుంచి పవర్ ఫుల్ కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్
రాకింగ్ స్టార్ యశ్(Rocking Star Yash) హీరోగా, గీతూ మోహన్ దాస్(Geethu Mohan Das) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’.

దిశ, వెబ్‌డెస్క్: రాకింగ్ స్టార్ యశ్(Rocking Star Yash) హీరోగా, గీతూ మోహన్ దాస్(Geethu Mohan Das) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యష్‌కు జోడిగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ వంటి వారు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం 2026 మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రుక్మిణి వసంత్ మెల్లిసాగా, నదియా పాత్రలో కియారా, ఎలిజబెత్‌గా హ్యుమా ఖురేషీ. గంగ పాత్రలో నయనతార, రాకింగ్ స్టార్ యష్ రాయ పాత్రలో నటించనున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా మూవీటీమ్ పవర్ ఫుల్ కౌంట్ డౌన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘టాక్సిక్ రిలీజ్ కావడానికి ఇంకా 58 రోజులే ఉన్నాయి’ అంటూ యష్ బ్యాక్ సైడ్ ఫొటో షేర్ చేశారు. ఇక పోస్టర్‌లో రాయ బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకుని షర్ట్ లేకుండా ఉన్నాడు. వీపు మీద ఓ టాటూ కూడా ఉంది. అంతేకాకుండా చేతిలో గన్ పట్టుకొని చాలా వైల్డ్‌గా కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






