అడివి శేష్ డెకాయిట్ వాయిదా.. కారణం తెలిసి ఆందోళనలో ఫ్యాన్స్

by Chukka Sudharani |

అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘డెకాయిట్: ఒక ప్రేమ కథ’.

అడివి శేష్ డెకాయిట్ వాయిదా.. కారణం తెలిసి ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘డెకాయిట్: ఒక ప్రేమ కథ’. షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. రివేంజ్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా క్రిస్మస్ స్పెషల్‌గా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో షూటింగ్‌లో కూడా వేగం పెంచాలనుకున్నారు మేకర్స్.

కానీ, డెకాయిట్ చిత్రీకరణలో హీరో అడవి శేష్‌కు గాయం కావడంతో షూటింగ్ వాయిదా పడింది. డాక్టర్ల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు అడివి శేష్. దీంతో షూటింగ్ కంప్లీట్ కానీ కారణంగా.. ఇప్పుడు ఈ మూవీ పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్. ఇక దీంతో పాటు G2 (గూడచారీ 2) కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మళ్లీ ఈ సినిమాల రిలీజ్‌పై అధికారిక ప్రకటన అడవి శేష్ తిరిగి షూటింగ్‌లో పాల్గొనేటప్పుడు తెలియనుంది. లింక్


Next Story