- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమా టికెట్ల రేట్ల పెంపుపై సీపీఐ నారాయణ ఆగ్రహం
సినిమా టికెట్ ధరల అంశంపై సీపీఐ నేత నారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు సిగ్గులేకుండా టికెట్ ధరలు పెంచమని అడిగితే ప్రభుత్వాలు బుద్ధి లేకుండా టికెట్ ధరలు పెంచుతున్నాయని మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: సినిమా టికెట్ ధరల అంశంపై సీపీఐ నేత నారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు సిగ్గులేకుండా టికెట్ ధరలు పెంచమని అడిగితే ప్రభుత్వాలు బుద్ధి లేకుండా టికెట్ ధరలు పెంచుతున్నాయని మండిపడ్డారు. వందల కోట్లు ఖర్చు చేసి సినిమాలు చేస్తే వాళ్లకు నష్టం వస్తుందని ప్రజల నుండి దోచుకుంటారా అని ప్రశ్నించారు. వందల కోట్లు పెట్టి సినిమాలు ఎవరు తీయమని చెప్పారని అడిగారు. సినిమా చూసేందుకు ప్రజలు వెళితే వాటర్ బాటిల్ కూడా తీసుకువెళ్లనివ్వరని, బిస్కెట్లు కూడా తీసుకువెళ్లనివ్వరని చెప్పారు.
అక్కడ కొనాలంటే వందల రూపాయలు ఖర్చు చేయాలన్నారు. చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారని మరి వాళ్లందరికి నష్టాలు వస్తే ప్రభుత్వం ఇస్తుందా అని ప్రశ్నించారు. సినిమా మాఫియా, ప్రభుత్వాలు కలిసి ప్రజలను లూటీ చేస్తున్నాయని మండిపడ్డారు. ఇదిలా ఉంటే కొత్త సినిమాల విడుదలకు ముందు బెనిఫిట్ షోలతో పాటు పదిరోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రీమియర్ షో టికెట్ ధరలు అయితే వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో ధరలు పెంచవద్దని సీపీఐ నారాయణ డిమాండ్ చేస్తున్నారు.






