- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OTT: ఓటీటీలో టాప్-1లో దూసుకుపోతున్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. అఫీషియల్ ట్వీట్ వైరల్
ప్రియదర్శి (Priyadarshi), హర్ష రోషన్ (Harsh Roshan), శ్రీదేవి (Sridevi) లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘కోర్ట్’ (Court).

దిశ, సినిమా: ప్రియదర్శి (Priyadarshi), హర్ష రోషన్ (Harsh Roshan), శ్రీదేవి (Sridevi) లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘కోర్ట్’ (Court). నేచురల్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి నిర్మించిన ఈ మూవీకి రామ్ జగదీష్ దర్శకత్వం వహించాడు. ఇందులో సీనియర్ నటుడు శివాజీ, సాయికుమార్, హర్ష వర్ధన్, రోహిణి, సుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర అనింగి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా మంగపతిగా శివాజీ నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి అనడంలో అతిశయోక్తి లేదు. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు క్రియేట్ అయిన ఈ చిత్రం.. మార్చి 14న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజైంది. చిన్న చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ పెద్ద పెద్ద సినిమాలను పక్కకు నెట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఏప్రిల్ 11వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ (OTT) సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ అవుతూ.. ఓటీటీలో కూడా కొత్త రికార్డులు సృష్టిస్తుంది. డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన కొన్ని గంటల్లోనే సత్తా చాటుకుంటూ టాప్ 1లో ట్రెండింగ్ అవుతోంది. దీనిపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ఈ మేరకు ‘న్యాయం మాట్లాడుతుంది. ప్రపంచం వింటుంది.. ‘కోర్టు: స్టేట్ vs ఎ నోబడీ’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో #1 ట్రెండింగ్‌లో ఉంది! ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ అండ్ మలయాళంలో చూడండి’ అనే క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ పెట్టింది. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
Justice speaks. And the world’s listening🔥Court: State vs A Nobody is trending at #1 on Netflix!
— Netflix India South (@Netflix_INSouth) April 12, 2025
Watch Court: State vs A Nobody, now on Netflix in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam.#CourtOnNetflix pic.twitter.com/VkYCZPVtic






