- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nani: నాని నిర్మాణంలో కోర్టు డైరెక్టర్ మరోమూవీ.. లీడ్ రోల్‌లో ఆ స్టార్ హీరో
నేచురల్ స్టార్ నాని (Nani) నిర్మాణంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కోర్టు’.

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని (Nani) నిర్మాణంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కోర్టు’. ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రాన్ని నేచురల్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి నిర్మించిన ఈ మూవీకి రామ్ జగదీష్ దర్శకత్వం వహించాడు. ఇందులో సీనియర్ నటుడు శివాజీ, సాయికుమార్, హర్ష వర్ధన్, రోహిణి, సుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర అనింగి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. భారీ అంచనాల మధ్య మార్చి 14న గ్రాండ్‌గా థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది.
ఇక ఈ సినిమాతో డైరెక్టర్ రామ్ జగదీష్ దశ కూడా మారినట్లు అయింది. దీంతో ఇప్పుడు ఈయన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్టు తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. మరోసారి నాని సమర్పణలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుండగా.. ఇందులో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan)ను హీరోగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కథ చెప్పగా దుల్కర్ కూడా ఓకే చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు మాత్రమ్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Buzz: #Court movie director Ram Jagadeesh is working on a powerful script for his second film, which will also be produced by #Nani. #DulquerSalmaan is currently being considered for the lead role! pic.twitter.com/0r709MT6E3
— Movies4u Official (@Movies4u_Officl) May 14, 2025






