- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ అప్పుడే
'విశ్వంభర'కి సంబంధించిన ఓటీటీ డీల్ ఈ వారంలో ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో ఈ వారంలోనే మూవీ విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి–మల్లాడి వశిష్ట కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చిత్రం ప్రారంభమై చాలా కాలమే అవుతోంది. ఈ సినిమాను మొదట 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన పలు విడుదల తేదీలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఒకానొక సందర్భంలో చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రాన్ని 2026 సమ్మర్ కానుకగా విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక విడుదల తేదీ ప్రకటించబడలేదు. ఇక తాజాగా ఈ మూవీ విడుదల తేదీకి సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ చర్చలు జరుగుతున్నట్లు, అవి ఓ కొలిక్కి వచ్చినట్లయితే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ డీల్ ఓకే అయ్యే అవకాశాలు ఉన్నాయని, దాంతో ఈ వారంలోనే ఈ సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించే ఛాన్సులు ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






